#SooraraiPottru: బాలీవుడ్‌కు ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీ.. సూర్య పాత్రలో నటించబోయే ఎవరంటే.!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన తాజాగా చిత్రం 'సూరరై పోట్ట్రు'. ఈ సినిమా తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో అనువాదమైంది.
Soorarai Pottru: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన తాజాగా చిత్రం ‘సూరరై పోట్ట్రు’. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో అనువాదమైంది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపినాధ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ నెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇక ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని.. సూర్య మహేష్ పాత్రలో జీవించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే.. మిగతా తారాగణాన్ని కూడా ఎంపిక చేయనున్నారట. కాగా, ఇప్పటికే షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటించగా.. ‘జెర్సీ’ హిందీ వెర్షన్ సెట్స్‌పై ఉంది. అలాగే ‘సూరరై పోట్ట్రు’ కన్నడలో కూడా డబ్ కానుంది.
Also Read:
‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..
రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..
#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?