కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేయడమే కారణం! .. సామాజిక బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం
ప్రేమ విఫలమైందన్న కారణంతో తెలుగు యువకుడొకరు కెనడా దేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏకంగా నైట్రోజన్ పీల్చి మరి మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. ప్రియురాలు మోసం చేసిందంటూ లేఖ రాసిన ఈ యువకుడు తన సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు చివరి క్షణంలోను ప్రయత్నించాడు.
Telugu youth suicide in Canada country: దేశం కాని దేశంలో తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది కూడా ప్రియురాలు మోసం చేసిందనే ఉక్రోశంతో. హైదరాబాద్ నగరానికి చెందిన ఈ యువకుడు కొంతకాలంగా కెనడాలో వుంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న కారణంగా ఈ యువకుడు.. నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని…ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రణయ్ పుచ్చకాయల. ప్రియురాలు అఖిల ప్రియ మోసం చేసిందంటూ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే.. వైరాగ్యంతో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్.. తన సామాజిక బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేశాడు. తన అవయవాలను దానం చేయాలని స్యూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలంటూ తన తల్లిదండ్రులకు లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా ప్రణయ్ స్వస్థలం హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడా ఏరియా. ప్రణయ్ తల్లిదండ్రులు హబ్సిగూడాలోనే నివాసముంటున్నారు. కన్న కొడుకు మృతి చెందాడన్న సమాచారంతో ప్రణయ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్
ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు
ALSO READ: వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట
ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి
ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..
ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు