వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట.. దేవాలయ నిర్మాణంపై రేగిన రచ్చ.. మహిళల ధర్నా

వైసీపీ వర్గాలు కొట్టుకున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలు రోడ్డెక్కి మరీ తగాదా పడ్డాయి. అందుకు కారణం ఓ దేవాలయ నిర్మాణం. వైసీపీలోనే ఓ వర్గం దేవాలయ నిర్మాణానికి పూనుకోగా.. మరో వర్గం దానిని అడ్డుకుని కూల్చేసింది. దాంతో రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది.

వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట.. దేవాలయ నిర్మాణంపై రేగిన రచ్చ.. మహిళల ధర్నా
Follow us

|

Updated on: Nov 15, 2020 | 3:05 PM

Faction fight in YCP Party: ప్రకాశంజిల్లా టంగుటూరు పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో గుడి నిర్మించే విషయంలో వైసిపికి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాలనీలో సాయిబాబా గుడి నిర్మించేందుకు పునాదులు తవ్వడంతో ఆగ్రహించిన మరో వర్గం నేతలు నిర్మాణాలను పడగొట్టారు. పునాదులు పెకలించి వేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సాయిబాబా చిత్రపటాలను, ఇతర పూజా సామాగ్రిని ద్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

గత కొంతకాలంగా కాలనీలో గుడి నిర్మించుకునేందుకు తాము ప్రయత్నిస్తుండగా స్థానికేతరులు కొంతమంది తమను అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే పంచాయతీ స్థలంలో అక్రమంగా గుడి నిర్మిస్తున్నారంటూ మరో వర్గం అడ్డుపడుతోంది. ఒక వర్గానికి గ్రామానికి చెందిన వైసిపి నేత రావూరి అయ్యవారయ్య నేతృత్వం వహిస్తుంటే మరోవర్గానికి మరో వైసిపి నేత కోటిరెడ్డి మద్దతు పలికారు. దీంతో వైసిపిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము గుడికట్టుకుంటుంటే కోటి రెడ్డి వర్గం అడ్డుపడుతోందని, వీరంతా స్థానికేతరులని గుడి నిర్మాణం చేపట్టిన మహిళలు ఆరోపిస్తున్నారు. తమను అడ్డుకుని గుడిని ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు