AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scissors Sharpening: కత్తెర మొద్దుబారిందా? ఇంట్లోనే ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!

ఇంట్లో, వంటగదిలో లేదా ఆఫీస్ పనుల్లో కత్తెర అత్యంత ముఖ్యమైన వస్తువు. కాగితాలు కట్ చేయడం నుండి బట్టలు కత్తిరించడం వరకు రోజూ దీని అవసరం పడుతుంది. అయితే, నిరంతరం వాడటం వల్ల కాలక్రమేణా కత్తెర పదును తగ్గిపోతుంది. కత్తెర సరిగ్గా కట్ చేయకపోవడం వల్ల మనం పనులు చేసేటప్పుడు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చాలామంది కత్తెర మొద్దుబారగానే పడేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొద్దిపాటి శ్రద్ధతో ఇంట్లోనే ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో కత్తెరను సరికొత్తగా పదును పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన సులభమైన పద్ధతులు ఇక్కడ తెలుసుకుందాం.

Scissors Sharpening: కత్తెర మొద్దుబారిందా? ఇంట్లోనే ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
Sharpen Scissors At Home
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2026 | 5:34 PM

Share

ఇంట్లో, వంటగదిలో లేదా ఆఫీస్ పనుల్లో కత్తెర అత్యంత ముఖ్యమైన వస్తువు. కాగితాలు కట్ చేయడం నుండి బట్టలు కత్తిరించడం వరకు రోజూ దీని అవసరం పడుతుంది. అయితే, నిరంతరం వాడటం వల్ల కాలక్రమేణా కత్తెర పదును తగ్గిపోతుంది. కత్తెర సరిగ్గా కట్ చేయకపోవడం వల్ల మనం పనులు చేసేటప్పుడు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. చాలామంది కత్తెర మొద్దుబారగానే పడేసి కొత్తది కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొద్దిపాటి శ్రద్ధతో ఇంట్లోనే ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో కత్తెరను సరికొత్తగా పదును పెంచుకోవచ్చు. దీనికి సంబంధించిన సులభమైన పద్ధతులు ఇక్కడ తెలుసుకుందాం.

మొదట శుభ్రం చేయడం ముఖ్యం

కత్తెర సరిగ్గా పనిచేయకపోవడానికి కేవలం పదును తగ్గడమే కాకుండా, దానిపై పేరుకుపోయిన ధూళి, తుప్పు కూడా ఒక కారణం కావచ్చు. దీనికోసం ఒక సన్నని సాండ్‌ పేపర్ తీసుకుని కత్తెర బ్లేడ్లను తేలికగా రుద్దాలి. దీనివల్ల బ్లేడ్లపై ఉన్న జిడ్డు, తుప్పు, మురికి సులభంగా తొలగిపోతాయి.

శుభ్రం చేసిన తర్వాత కత్తెర రెండు బ్లేడ్లు కలిసే జాయింట్ వద్ద కొద్దిగా మెషిన్ ఆయిల్ వేయాలి. ఇలా చేయడం వల్ల బ్లేడ్ల కదలిక మృదువుగా మారుతుంది. కత్తెర గట్టిగా అడ్డుపడకుండా సాఫీగా కట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

కత్తెర పదును పెంచే సులభమైన పద్ధతులు: సాండ్‌ పేపర్ ట్రిక్: ఒక సాండ్‌పేపర్‌ను తీసుకుని మధ్యలోకి మడవండి. ఇప్పుడు ఆ సాండ్‌పేపర్‌ను మీ కత్తెరతో పలుమార్లు కట్ చేయండి. హ్యాండిల్ నుండి చివర వరకు బ్లేడ్ మొత్తం తగిలేలా చేయాలి. ఈ ట్రిక్ వల్ల కత్తెర బ్లేడ్లు చాలా త్వరగా పదును తేలుతాయి.

షార్పెనింగ్ స్టోన్: మార్కెట్లో దొరికే చిన్న షార్పెనింగ్ స్టోన్ లేదా రాయి సహాయంతో కూడా బ్లేడ్ కోణానికి తగినట్లుగా పదును పెట్టవచ్చు.

ఈ పద్ధతులు పాటించేటప్పుడు వేళ్లకు గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో ఉండే చిన్నపాటి వస్తువులతోనే మొద్దుబారిన కత్తెరను సరికొత్తగా మార్చుకుని మీ పనులను సులభం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us