సానా లింకుల్లో ’పెద్ద చేపలు‘.. ఈడీ నోటీసులు

ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న సానా సతీష్ నుంచి అధికారులు ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. సతీష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు తెలుగు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. వారిలో షబ్బీర్ అలీ, సుఖేష్ గుప్తా, రమేష్, చాముండిలు ఉన్నారు. ఇంకా మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు. కాగా సుఖేష్ గుప్తా బెయిల్ కోసం మెయిన్ ఖురేషి, సతీష్, షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం […]

  • Updated On - 11:55 am, Sat, 3 August 19 Edited By: Pardhasaradhi Peri
సానా లింకుల్లో ’పెద్ద చేపలు‘.. ఈడీ నోటీసులు


ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న సానా సతీష్ నుంచి అధికారులు ముఖ్య సమాచారాన్ని రాబడుతున్నారు. సతీష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు తెలుగు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. వారిలో షబ్బీర్ అలీ, సుఖేష్ గుప్తా, రమేష్, చాముండిలు ఉన్నారు. ఇంకా మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు.

కాగా సుఖేష్ గుప్తా బెయిల్ కోసం మెయిన్ ఖురేషి, సతీష్, షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం జరిపినట్లు ఈడీకి సమాచారం అందింది. సుఖేష్‌కి బెయిల్ కోసం సీబీఐ అధికారులతో సత్సంబంధాలున్న మొయిన్ ఖురేషికి సానా సతీష్ ద్వారా కోటిన్నర రూపాయలు అందాయి. ఈ ముగ్గురు ప్రముఖులు సుఖేష్‌కు బెయిల్ కోసం సీబీఐ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ కేసులో మధ్యవర్తిత్వం చేసిన ప్రముఖ స్కూల్ డైరక్టర్ రమేష్‌కు కూడా నోటీసులు వెళ్లాయి. చాముండికి సానా సతీష్‌తో వ్యాపార సంబంధాలున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు తెలుగు ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాగా ఇటీవలే సానా సతీష్ కస్టడీని మరో తొమ్మిది రోజుల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.