AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్లిగవ్వ లేని నీదీ ఓ షాపేనా..? ‘దొంగ’ గారి ఫన్నీ లెటర్

దొంగతనం చేయడమంటే మాటలు కాదు. చాలా నేర్పరితనం ఉండాలి. అయితే దొంగతనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిండు చేతులతో రాలేరు. ఒక్కోసారి వారికి ఒక్క వస్తువు కూడా దొరకదు. ఇలానే ఇటీవల చోరికి వెళ్లిన ఓ దొంగకు డబ్బు, విలువ చేసే వస్తువులు కనిపించలేదు. దీంతో చాలా బాధపడ్డ ఆ దొంగ.. ఓ లేఖను రాసి వెళ్లాడు. అందరికీ నవ్వు తెప్పిస్తున్న ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని […]

చిల్లిగవ్వ లేని నీదీ ఓ షాపేనా..? ‘దొంగ’ గారి ఫన్నీ లెటర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 12:19 PM

Share

దొంగతనం చేయడమంటే మాటలు కాదు. చాలా నేర్పరితనం ఉండాలి. అయితే దొంగతనానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నిండు చేతులతో రాలేరు. ఒక్కోసారి వారికి ఒక్క వస్తువు కూడా దొరకదు. ఇలానే ఇటీవల చోరికి వెళ్లిన ఓ దొంగకు డబ్బు, విలువ చేసే వస్తువులు కనిపించలేదు. దీంతో చాలా బాధపడ్డ ఆ దొంగ.. ఓ లేఖను రాసి వెళ్లాడు. అందరికీ నవ్వు తెప్పిస్తున్న ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని మందారకుప్పంలో జయరాజ్ అనే వ్యక్తి దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ షాపుపై ఓ దొంగ కన్ను పడింది. ఎలాగైనా అక్కడ కన్నం వేసి దోచుకోవాలని భావించాడు. దీంతో గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణంలోకి దూరాడు. డబ్బు పెట్టే క్యాష్‌ కౌంటర్‌తో పాటు షాప్ మొత్తం వెతికాడు. అయినా చిల్లిగవ్వ కూడా దొరకలేదు. దీంతో నిరాశకు గురైన ఆ దొంగ ఓ ఉత్తరాన్ని రాసి వెళ్లాడు.

‘‘‘ప్రాణాన్ని పణంగా పెట్టి కష్టపడి దొంగతనానికి వచ్చా. క్యాష్ కౌంటర్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టకపోవడం మీకేమైనా భావ్యమా..? దుకాణంలో ఉన్న పప్పు దినుసులు పట్టుకెళ్లి నేనేం చేయాలి..? చిర్రెత్తుకొచ్చి ఈ ఉత్తరం రాస్తున్నా’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా శుక్రవారం ఉదయాన్నే దుకాణం తెరిచిన జయరాజ్‌కు తన షాప్‌లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉండటం గమనించి.. దొంగతనం జరిగి ఉంటుందని భావించాడు. ఆ తరువాత వస్తువులేం మాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అతడు ఉత్తరం చూసి షాక్ అయ్యాడు. ఇక విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చేతి రాత ఆధారంగా వారు దొంగను గుర్తించే పనిలో పడ్డాడు.

Follow Us
రష్మికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. ట్రెండింగ్ లో మైసా సాంగ్
రష్మికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. ట్రెండింగ్ లో మైసా సాంగ్
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే