ఒకే ఒక్క ట్వీట్…సమంతను టార్గెట్ చేసిన సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ అభిమానులు..ఇంతకీ ఏంటా ట్వీట్ !
ఒకే ఒక్క మాటతో ఇద్దరు హీరోలకు బ్యాడ్ అయ్యారు అక్కినేని కోడలు సమంత. అలాగని ఆమె నోరు జారి ఏదైనా అనరాని మాట అన్నారా.. అంటే అదీకాదు.
ఒకే ఒక్క మాటతో ఇద్దరు హీరోలకు బ్యాడ్ అయ్యారు అక్కినేని కోడలు సమంత. అలాగని ఆమె నోరు జారి ఏదైనా అనరాని మాట అన్నారా.. అంటే అదీకాదు. తనకు నచ్చిన సినిమాను అభినందిస్తూ.. ట్విట్టర్లో జస్ట్.. ఒక్క కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సమంతను బన్నీ ఫ్యాన్స్.. మహేష్ ఫ్యాన్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు
ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమా చూసి సూర్య అండ్ హిజ్ టీమ్‌ని ఆకాశానికెత్తేశారు సమంత. అక్కడితో ఆగితే సరిపోయ్యేది.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ఇదే అని ఓపెన్‌గా సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇది జరిగి కూడా వారం రోజులైంది. ఈ కామెంట్‌ను రోజూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ అభిమానులు. ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అదెలా అవుతుంది.. మన సినిమాలేమీ చూడలేదా అని ఎదురుప్రశ్నలు మొదలయ్యాయి. మరీముఖ్యంగా.. సంక్రాంతికొచ్చిన ఆ రెండు సినిమాల సంగతేంటి అని గుచ్చిగుచ్చి అడిగేస్తున్నారు నెటిజన్లు.
బ్లాక్‌బస్టర్స్ అయిన ఆ రెండు సినిమాల్ని వదిలిపెట్టి.. ఏదో పొరుగూరి సినిమాను అంత పొగిడేస్తారా.. ఇదీ ఇప్పుడు వారి సమస్య. నచ్చితే నచ్చుండొచ్చు.. ఇలా తొందరపడి కాంప్లిమెంట్లిచ్చేసరికి వారి మనోభావాలు హర్ట్ అయ్యాయి. కానీ స్వాభిమానం ఎక్కువున్న సమంత వారి కామెంట్లను లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుంటుంది.
Also Read :
పతనమైన గుడ్డు ధర, ఆందోళనలో ఫౌల్ట్రీ యజమానులు : కార్తీక మాసం ప్రభావంతో పాటు మరికొన్ని కారణాలు !
Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో