అమీర్‌తో నటించే అవకాశాన్ని తిరస్కరించిన కోలీవుడ్ హీరో.. ఎందుకు ఈ ఆఫర్ రిజెక్ట్ చేశాడంటే..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఇక్కడ ఓ హీరో మాత్రం అంది వచ్చిన

  • uppula Raju
  • Publish Date - 10:18 pm, Wed, 9 December 20
అమీర్‌తో నటించే అవకాశాన్ని తిరస్కరించిన కోలీవుడ్ హీరో.. ఎందుకు ఈ ఆఫర్ రిజెక్ట్ చేశాడంటే..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఇక్కడ ఓ హీరో మాత్రం అంది వచ్చిన అవకాశాన్ని తిరిస్కరించాడు. కారణం తెలిస్తే షాక్‌కు గురవుతారు. దీనిపై ఇండస్ట్రీలో ఇప్పుడు పలు పుకార్లు వినబడుతున్నాయి. దీనికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

అమీర్‌ఖాన్ హీరోగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా లాల్ సింగ్ ఛధా. అమెరిక‌న్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్‌. అమీర్ ఏ సినిమానైనా టేకాఫ్ చేశాడంటే ఆ సినిమా గురించి అందులోని పాత్ర గురించి ఎంతగానో కష్ట పడుతాడు. అందుకు అమీర్ గత సినిమాలు చూస్తే మనకు తెలిసిపోతుంది. తాజాగా లాల్ సింగ్ ఛధా సినిమాలో ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌‌లో బుబ్బా (రొయ్య‌ల వ్యాపారంపై మ‌క్కువ ఉన్న వ్య‌క్తి) రోల్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి అయితే బాగుంటుంద‌ని అమీర్‌ఖాన్ భావించాడట. దీనికోసం విజయ్‌ని సంప్రదించాడని సమాచారం. అయితే ఈ పాత్రకు కొంచెం బొద్దుగా కనిపించాల్సి ఉంటుంది. దీంతో విజయ్ సేతుపతి బరువు పెరిగేందుకు రెడీగా లేకపోవడంతో ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. వెంటనే అమీర్ ఖాన్ టీవీ న‌టుడు మాన‌వ్ విజ్‌ను ఈ రోల్‌కు సెలెక్ట్ చేశాడని తెలిసింది.