ఆ ఉద్యోగులకు.. 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో

ఆ ఉద్యోగులకు.. 170 శాతం జీతాలు పెంచిన కేంద్రం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2020 | 8:17 AM

People Working On Building Roads In Border Areas: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కనీస వేతనాన్ని 100 నుంచి 170 శాతానికి ప్రభుత్వం పెంచింది. పెరిగిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ హైవేలు మౌలిక రంగ అభివృద్ధి కార్పొరేషన్ వెల్లడించింది.

చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందికి రిస్క్ అలవెన్స్ ను 100 నుంచి 170 శాతానికి పెంచినట్టు ఆ సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి సాంకేతికేతర సిబ్బంది వేతనం నెలకు ప్రస్తుతమున్న 16,770 రూపాయల నుంచి 41,440 రూపాయలకు పెరిగింది. ఇక ఢిల్లీలో ఇదే పోస్టులో పనిచేసే వ్యక్తి వేతనం 28,000 రూపాయలు కావడం గమనార్హం. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రూ పది లక్షల ప్రమాద బీమాను పొందుతారు.