AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో రూ. 300లతో వచ్చాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. వందల కోట్ల ఆస్తికి అధిపతి

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయినా వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు.. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు .

చేతిలో రూ. 300లతో వచ్చాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. వందల కోట్ల ఆస్తికి అధిపతి
Tollywood News
Rajeev Rayala
|

Updated on: May 31, 2026 | 6:55 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ ఎన్నో కష్టపడి వచ్చి స్వయంశక్తితో స్టార్స్ గా ఎదిగారు. వారిలో ఈ హీరో ఒకరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఎన్నో కష్టాలు పడి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి.. అలాగే సీరియల్స్ లో నటించి ఆతర్వాత హీరోగా మారాడు. కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతే కాదు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఆయన తండ్రి బస్సు డ్రైవర్. చేతిలో రూ. 300లతో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయన భార్య కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు..

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

కన్నడ ఇండస్ట్రీలో రాక్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు యష్. పాన్ ఇండియా సినీ ప్రియులకు రాక్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలు సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ హీరోగా తనను తాను నిరూపించుకోవడానికి ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు యశ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. యశ్ అసలు పేరు నవీన్, కర్ణాటకలోని హసన్ అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

యశ్ తల్లి తన కుమారుడి పేరు యశ్వంత్ మార్చుకున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాకా.. యశ్ గా పేరు మార్చుకున్నారు యశ్. పాఠశాల రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న యశ్. 16 ఏళ్ల వయసులో ఓ ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటానికి బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. కేవలం రూ.300 తీసుకుని.. బెంగుళూరు బయలుదేరాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాలు దొరకకపోవడంతో థియేటర్ ట్రూప్ లో బ్యాక్ డాన్సర్ గా చేరాడు. అప్పుడు అతనికి రోజుకు రూ.50 చెల్లించేవారు. 2018లో 18 సంవత్సరాల వయసులో ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2005లో తన భార్య రాధిక పండిట్ తో కలిసి నంద గోకుల అనే సీరియల్లో నటించారు. ఆ తర్వాత 2007లో జంబాడ హుడుగి చిత్రంలో సహయ పాత్ర పోషించారు. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు యష్.

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us