రష్యా ప్రతిపక్షనేతపై విషప్రయోగం..!
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అపమారక స్థితిలో ఉన్నఅతన్ని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. టోమ్స్క్ నుంచి మాస్కో వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నిపై విషప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. అపమారక స్థితిలో ఉన్నఅతన్ని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. టోమ్స్క్ నుంచి మాస్కో వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గతకొంతకాలంగా రష్యాలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నవాల్నీ నిర్వహిస్తున్నారు. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న ఆయన.. ఒక్కసారిగా ఉన్నట్టుండీ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో విమానాన్ని ఓమ్స్క్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. నవాల్నీకి ఇచ్చిన టీలో విషం కలిపి ఉంటారని అతని ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను.. నవాల్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో రెండు పర్యాయాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఇటీవల పుతిన్ రాజ్యాంగ సవరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్కరణల అమలులో భారీ కుట్ర జరిగినట్లు నవాల్నీ ఆరోపిస్తున్నారు. నవాల్నీ ఉదయం నుంచి కేవలం టీ మాత్రమే తాగారని, దాంట్లోనే ఏదో కలిపి ఉంటారని అతని ప్రతినిధి యార్మ్‌షి ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో జూలై 2019 లో 30 రోజుల జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ జైలు శిక్ష సమయంలో అతను అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు అతన్ని “కాంటాక్ట్ డెర్మటైటిస్” అని నిర్ధారించారు. కాని అతను ఎప్పుడూ తీవ్రమైన అలెర్జీ లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. అతను “కొన్ని టాక్సిక్ ఏజెంట్” కు గురయ్యే అవకాశం ఉందని అతని స్వంత వైద్యుడు సూచించాడు. మరోవైపు నవాల్ని విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కూడా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. దీని రష్యా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.