AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,25,82,361కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,91,029 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 64,87,325 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,53,04,007 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2020 | 11:25 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,25,82,361కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,91,029 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 64,87,325 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,53,04,007 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 57,00,931కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,76,337 మంది మృతి చెందారు. కాగా 24,62,263 యాక్టీవ్ కేసులు ఉండగా, 30,62,331 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 977 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,926కి చేరుకుంది. ఇందులో 6,86,395 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,866 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 20,96,664 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Read More:

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి

వ‌చ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వ‌న్ నేష‌న్‌-వ‌న్ రేష‌న్’

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..