చాణక్య నీతి : వివాహం తర్వాత భర్త అస్సలే చేయకూడని తప్పులు ఇవే
Samatha
19 August 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు.
చాణక్యుడు బంధాలు బంధుత్వాల గురించి చాలా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన పెళ్లి తర్వాత భర్త చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్యుడు వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలి అంటే, ఎట్టి పరిస్థితుల్లో భార్యను అవమానించకూడదు అని చెబుతున్నాడు.
అంతే కాకుండా ఎప్పుడూ కూడా భార్య దగ్గర రహస్యాలు దాచడం, అబద్ధాలు చెప్పడం చేయకూడదు. దీని వలన సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది.
అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది బాధ్యతలు అన్నీ భార్యకు అప్పజెప్పి తప్పించుకుంటున్నారు. కానీ అస్సలే అలా చేయకూడదంట.
మరీ ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ భార్యను పరాయి స్త్రీతో పోల్చి చూడకూడదు. ఇది వైవాహిక జీవితం ముగింపుకు కారణం అవుతుంది.
మద్యం, జూదం, స్నేహితులతో ఎక్కువగా గడుపుతూ సమయాన్ని వృధా చేయకూడదు. దీని వలన కుటుంబమే నాశనం అవుతుంది.
అలాగే ఎప్పుడూ కూడా భార్యను, ఆమె కుటుంబ సభ్యులను గౌరవించాలి. లేకపోతే అది భార్య భర్తల మధ్య మనస్పర్థలకు కారణం అవుతుందంట.