AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ల తప్పుడు వైద్యం.. కళ్లు లేకుండా పుట్టిన శిశువు! దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కోర్టు..

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబానికి కోటి రూపాయల భారీ పరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గర్భిణీగా ఉన్న సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్‌ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డకు కళ్ళు లేవన్న విషయాన్ని గుర్తించడంలో వైద్యులు పూర్తిగా విఫలమవడంతో ఈ తీర్పు వెలువడింది. భారీ పరిహారంతో పాటు ఫిర్యాదు చేసిన తేదీ నుంచి 12 శాతం వడ్డీ చెల్లించాలని కమిషన్ సదరు ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది..

డాక్టర్ల తప్పుడు వైద్యం.. కళ్లు లేకుండా పుట్టిన శిశువు! దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కోర్టు..
Hospital Fined Rs 1 Crore For Wrong Fetal Reports
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: May 11, 2026 | 7:51 PM

Share

ఆదిలాబాద్, మే 11: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భాగ్యశ్రీ జీవితంలో తల్లితనం అనేది ఆనందం నింపాల్సిన సమయం. గర్భం దాల్చిన తర్వాత ప్రతి నెలా ఆమె వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ పరీక్షలు చేయించుకుంది. ప్రతి సారి కూడా వైద్యులు “శిశువు ఆరోగ్యంగానే ఉంది.. ఎలాంటి సమస్య లేదు” అని చెప్పడంతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కానీ కాన్పు జరిగిన రోజు ఆ కుటుంబం జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. జన్మించిన శిశువుకు రెండు కళ్లు లేవని తెలిసి తల్లి భాగ్యశ్రీ తీవ్ర ఆవేదనకు గురైంది. గర్భధారణ సమయంలో పలుమార్లు స్కానింగ్ చేసినప్పటికీ ఇంత పెద్ద లోపాన్ని గుర్తించకపోవడం ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించింది.

తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం భాగ్యశ్రీ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తాను మానసికంగా, ఆర్థికంగా, తీవ్రంగా నష్టపోయానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గర్భధారణ సమయంలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండా, తప్పుడు నివేదికలు ఇవ్వడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కమిషన్ అభిప్రాయపడింది.

దీంతో బాధితురాలు భాగ్యశ్రీకి భారీ ఊరటనిస్తూ కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. ఆమెకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, అదనంగా కోర్టు ఖర్చుల కింద రూ.34 వేలును కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు వైద్య రంగంలో బాధ్యత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది. గర్భిణులకు ఇచ్చే ప్రతి నివేదిక ఒక కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, వైద్యుల నిర్లక్ష్యానికి చట్టం కఠినంగా స్పందిస్తుందని ఈ ఘటన స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..
అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?