RRR టీజర్‌పై వివాదం.. ఆదివాసీల ఆగ్రహం..

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఎన్టీఆర్ పోషించిన భీమ్ పాత్రకు సంబంధించిన

RRR టీజర్‌పై వివాదం.. ఆదివాసీల ఆగ్రహం..
Follow us

|

Updated on: Oct 25, 2020 | 10:38 AM

Komaram Bheem Teaser: రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఎన్టీఆర్ పోషించిన భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిపై వివాదం రాజుకుంది. ఆ టీజర్‌లో కొమురం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జైనూర్ కొమురం భీమ్ యువసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని నిలదీశారు. కొమురం భీమ్ చరిత్రను అర్ధం చేసుకొని సినిమా తీయాలని.. గిరిజనుల మనోభావాలను దెబ్బ తీయొద్దని.. వెంటనే ఆ దృశ్యాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Bigg Boss 4: మోనాల్ సేఫ్.. దివిని హౌస్ నుంచి పంపించేశారు..!