బోటు పైకి తీసే సమయంలో.. మీడియా పై ఎందుకు బ్యాన్..?

గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గిన నేపథ్యంలో.. బోటు వెలికితీత పై ఆశలు చిగురిస్తున్నాయి. సోమవారం బయటకు తీయాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ రోజు కూడా బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగిపోవడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. ఇక మంగళవారం మధ్యాహ్నం వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:37 pm, Tue, 1 October 19
బోటు పైకి తీసే సమయంలో.. మీడియా పై ఎందుకు బ్యాన్..?

గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గిన నేపథ్యంలో.. బోటు వెలికితీత పై ఆశలు చిగురిస్తున్నాయి. సోమవారం బయటకు తీయాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ రోజు కూడా బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగిపోవడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. ఇక మంగళవారం మధ్యాహ్నం వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. దీంతో మరోసారి లంగర్ వేశారు.

రెండో సారి వేసిన లంగర్ ఐరన్ కొక్కెం పెద్దగా ఉండటంతో లంగర్‌కు బోటు తగిలిందని, బోటు కదిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇక రేపు బోటు వెలికితీయడం ఖాయం అని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. ఇదిలా ఉంటే, కచ్చులూరు వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. మీడియా పై బ్యాన్ ఎందుకు విధించారో.. అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజానీకాన్ని మాత్రం రానిస్తున్నారు.