ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైలు ఆలస్యమైతే క్యాష్ బ్యాక్!
రైల్వేస్‌ను మరింత అభివృద్ధి చేయడానికి.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. అక్టోబర్ నుంచి ఈ ‘ప్రైవేటు’ రైలు పట్టాలెక్కనున్నాయి. అంతేకాకుండా ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ఈ రైళ్లలో పలు ఆఫర్లను ప్రకటిస్తారని సమాచారం. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రైవేట్ రైలు […]
రైల్వేస్‌ను మరింత అభివృద్ధి చేయడానికి.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. అక్టోబర్ నుంచి ఈ ‘ప్రైవేటు’ రైలు పట్టాలెక్కనున్నాయి. అంతేకాకుండా ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ఈ రైళ్లలో పలు ఆఫర్లను ప్రకటిస్తారని సమాచారం.
ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిపిస్తారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇందులో రెండుసార్లు భోజనం, ఉచితంగా టీ, కాఫీల కోసం వెండింగ్ మిషన్ ఏర్పాటుతో పాటు సీనియర్ సిటిజెన్ల టికెట్‌పై 40% డిస్కౌంట్ ఇవ్వనుందట. మరోవైపు తేజస్ ప్రైవేటు టికెట్ కొనేవారికి రూ. 50లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా వర్తిస్తుందని సమాచారం. రైల్లో ఉన్న సమయంలో వారింట్లో దొంగలు పడితే ఆ నష్టపరిహారం కూడా వస్తుందట. అటు రైలు గంట ఆలస్యమైతే అందుకు తగ్గ పరిహారం ప్రకటిస్తుంది.