రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి, విజయ్‌ఘాట్‌లో శాస్త్రీజీకి..

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు. మహాత్ముడి ఆశయాలను జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు. At Rajghat, paid tributes to Bapu. Gandhi Ji’s commitment to peace, harmony and brotherhood remained unwavering. […]

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి, విజయ్‌ఘాట్‌లో శాస్త్రీజీకి..
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 10:35 AM

మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు. మహాత్ముడి ఆశయాలను జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు.

ఇక విజయ్‌ఘాట్‌లో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. లాల్‌బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు నివాళి అర్పించారు.

ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహాత్ముడు గాంధీ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు.