రాబర్ట్ వాద్రా విదేశాలకి వెళ్లొచ్చు.. కండిషన్స్ అప్లై..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా, నెదర్లాండ్స్ వెళ్లొచ్చని తెలిపింది. అయితే లండన్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. అందుకు అంగీకరించిన వాద్రా తన.. లండన్ పర్యటనకు సంబంధించిన అభ్యర్థనను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ కాలంలో ఆయన కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినప్పటికీ అవి చెల్లుబాటు […]

రాబర్ట్ వాద్రా విదేశాలకి వెళ్లొచ్చు.. కండిషన్స్ అప్లై..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 03, 2019 | 1:20 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా, నెదర్లాండ్స్ వెళ్లొచ్చని తెలిపింది. అయితే లండన్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది.

అందుకు అంగీకరించిన వాద్రా తన.. లండన్ పర్యటనకు సంబంధించిన అభ్యర్థనను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ కాలంలో ఆయన కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ అయినప్పటికీ అవి చెల్లుబాటు కావని కోర్టు తెలిపింది.