జగన్ కేబినెట్‌లో కొత్త ముఖాలు.. వారెవరు..?

ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న ఏపీ కేబినెట్‌ మంత్రులు ఖరారు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు జగన్ కేబినెట్‌లో చోటు లేదని అంటున్నారు. సీనియర్, రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే ఆ భాగ్యం కలగవచ్చునని తెలుస్తోంది. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఈ కేబినెట్‌లో చోటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:38 pm, Mon, 3 June 19
జగన్ కేబినెట్‌లో కొత్త ముఖాలు.. వారెవరు..?

ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ కేబినెట్‌ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న ఏపీ కేబినెట్‌ మంత్రులు ఖరారు కానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు జగన్ కేబినెట్‌లో చోటు లేదని అంటున్నారు. సీనియర్, రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే ఆ భాగ్యం కలగవచ్చునని తెలుస్తోంది. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఈ కేబినెట్‌లో చోటు లభించవచ్చునేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మంత్రి వర్గ ఏర్పాటుపై సలహాలు, సూచనల కోసం వైఎస్ జగన్ మంగళవారం.. స్వరూపానంద స్వామిని కలవనున్నారు. కాగా మంత్రి రేస్‌లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి గౌతమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం.