AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్య కేసు నిందితులకు 17వరకు రిమాండ్..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. నిందితులు ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌కు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సిట్ సేకరించింది. మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటుతో వివేకా మృతి చెందారని కుటుంబ […]

వివేకా హత్య కేసు నిందితులకు 17వరకు రిమాండ్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2019 | 1:40 PM

Share

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. నిందితులు ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌కు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సిట్ సేకరించింది.

మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటుతో వివేకా మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వివేకాది హత్య అని తేలింది. రాజకీయంగా రచ్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణకు సిట్‌ను నియమించింది.

వివేకా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో రక్త నమూనాలు చెరిపివేయడంతో పాటు కీలక సాక్ష్యాలను ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డితో పాటు వంట మనిషి కుమారుడు ప్రకాష్‌లు తారుమారు చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Follow Us
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ సినిమా నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
ఆ ప్రభుత్వ బడిలో సీటు దొరకడం అంత ఈజీ కాదు! సీటు కోసం భారీ పోటీ
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
72 గంటల్లో ఆ ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణ..
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
మటన్ బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. కస్టమర్‌కు భారీ పరిహారం
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
824కు పెరగనున్న లోక్‌సభ ఎంపీ స్థానాలు!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి డేట్ ఫిక్స్
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. కరెంటు బిల్లు సగం తగ్గుతుంది
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..