భారతదేశంలో అవి ఎప్పటికీ సాధ్యం కావు: సిద్ధార్ధ్

భారతదేశంలో అవి ఎప్పటికీ సాద్యం కావంటూ సంచలన ట్వీట్ చేశారు నటుడు సిద్ధార్థ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘‘ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే మతం.. ఇవి భారతదేశంలో ఎప్పటికీ సాధ్యం కావు. ఎవరెన్నీ చేసినా.. ఇవి ఎప్పటికీ జరగవు’’ అంటూ కామెంట్ పెట్టారు. One #nation. One #language. One #religion. This will never happen in #India no matter […]

భారతదేశంలో అవి ఎప్పటికీ సాధ్యం కావు: సిద్ధార్ధ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 03, 2019 | 12:54 PM

భారతదేశంలో అవి ఎప్పటికీ సాద్యం కావంటూ సంచలన ట్వీట్ చేశారు నటుడు సిద్ధార్థ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘‘ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే మతం.. ఇవి భారతదేశంలో ఎప్పటికీ సాధ్యం కావు. ఎవరెన్నీ చేసినా.. ఇవి ఎప్పటికీ జరగవు’’ అంటూ కామెంట్ పెట్టారు.

కాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎనిమిదో తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని హిందీయేతర రాష్ట్రాల నేతలు ఖండించారు. దీంతో వెనక్కి తగ్గిన ఎన్డీయే ప్రభుత్వం.. హిందీ తప్పనిసరి కాదని తేల్చింది. మూడు భాషల్లో విద్యార్థులకు నచ్చింది ఎంచుకోవచ్చునని కేంద్రం తాజాగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.