ఎడతెరపి లేని వాన… కుంగిన రోడ్లు..

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారులు కొట్టుకు...

ఎడతెరపి లేని వాన... కుంగిన రోడ్లు..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 1:08 AM

Roads damaged by heavy rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారులు కొట్టుకు పోతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లుకు కొట్టుకు పోయాయి.  శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి కుంగిపోయింది. ఘాట్‌లలో పలు చోట్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. అయితే రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయ ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. ఈదారిలో ప్రయాణాలను నిలిపివేశారు.

ఇక భద్రాచలం, పాల్వంచల మధ్య రాకపోకలు నిలిపివేశారు. బూర్గంపహాడ్ పినపాక పట్టి నగర్ దగ్గర కిన్నెరసాని బ్రిడ్జ్ నాగారం వైపు పెద్ద సొరంగం పడింది. దీంతో అటుగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనితో భద్రాచలం- పాల్వంచ మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.