హెల్మెట్ ధరించని వాహనదారులకు వింత శిక్ష.. ఎక్కడంటే..!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా పట్టుబడిన ద్విచక్ర వాహనదారులకు పెనాల్టీ విధించకుండా, వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే.. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ సంక్షిప్త వ్యాసం రాయమని అడుగుతున్నారు. గత ఆరు రోజులలో, రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా భోపాల్‌లో 150 మందికి పైగా హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించారు. వారితో 100 పదాల వ్యాసం రాయించారు. ద్విచక్ర వాహనాల రైడర్స్ రక్షణ కోసం హెల్మెట్లు చాలా అవసరం అని […]

హెల్మెట్ ధరించని వాహనదారులకు వింత శిక్ష.. ఎక్కడంటే..!
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 3:48 PM

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా పట్టుబడిన ద్విచక్ర వాహనదారులకు పెనాల్టీ విధించకుండా, వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే.. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ సంక్షిప్త వ్యాసం రాయమని అడుగుతున్నారు. గత ఆరు రోజులలో, రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా భోపాల్‌లో 150 మందికి పైగా హెల్మెట్ నిబంధనలను ఉల్లంఘించారు. వారితో 100 పదాల వ్యాసం రాయించారు. ద్విచక్ర వాహనాల రైడర్స్ రక్షణ కోసం హెల్మెట్లు చాలా అవసరం అని పోలీసు అధికారులు తెలిపారు.

“కొనసాగుతున్న రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా.. హెల్మెట్ లేకుండా దొరికిన ద్విచక్ర వాహనదారులు ఈ అవసరమైన భద్రతా నిబంధనను ఎందుకు ఉల్లంఘిస్తున్నారో వివరిస్తూ 100 పదాలలో ఒక వ్యాసం రాయలి” అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ప్రదీప్ చౌహాన్ తెలిపారు. రహదారి భద్రతా వారం (జనవరి 11 నుండి 17 వరకు) ముగిసిన తర్వాత కూడా ఈ పధ్ధతి కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

గత కొద్ధి రోజులుగా భోపాల్ లోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో వారు ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడానికి స్థానికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం కంటి శిబిరం కూడా ఏర్పాటు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.