AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సిస్టర్స్ పిటిషన్ ని కొట్టివేయండి, కోర్టుకు రియా అభ్యర్థన

సుశాంత్ సింగ్ కేసులో అతని ఇద్దరు సిస్టర్స్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేయాలని రియా చక్రవర్తి బాంబేహైకోర్టును కోరింది. ఈ మేరకు ఆమె అఫిడవిట్ దాఖలు చేసింది. సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతు సింగ్ తమ సోదరునికి తప్పుడు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రియా వారిపై లోగడ కేసు పెట్టింది. అయితే దీన్ని కొట్టివేయాలని వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు.  వారి వాదనను డిస్మిస్ చేయాలని  రియా తాజాగా అభ్యర్థించింది. ప్రస్తుతం […]

సుశాంత్ సిస్టర్స్ పిటిషన్ ని కొట్టివేయండి, కోర్టుకు రియా అభ్యర్థన
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 27, 2020 | 7:24 PM

Share

సుశాంత్ సింగ్ కేసులో అతని ఇద్దరు సిస్టర్స్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేయాలని రియా చక్రవర్తి బాంబేహైకోర్టును కోరింది. ఈ మేరకు ఆమె అఫిడవిట్ దాఖలు చేసింది. సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతు సింగ్ తమ సోదరునికి తప్పుడు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రియా వారిపై లోగడ కేసు పెట్టింది. అయితే దీన్ని కొట్టివేయాలని వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు.  వారి వాదనను డిస్మిస్ చేయాలని  రియా తాజాగా అభ్యర్థించింది. ప్రస్తుతం వారి పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రాథమిక  దశలో ఉందని, లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి మరింత వ్యవధిని ఇవ్వవలసి ఉందని రియా పేర్కొంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ లభించిన విషయం  గమనార్హం.

Follow Us