వైసీపీలోకి గంటా కుమారుడు, సాయి రెడ్డి ఏమన్నారంటే !

టీడీపీకి నాయకులు ఒకరి వెంట ఒకరు గుడ్ చెబుతూ అధికార వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతల వారసులు పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

వైసీపీలోకి గంటా కుమారుడు, సాయి రెడ్డి ఏమన్నారంటే !
Follow us

|

Updated on: Oct 02, 2020 | 1:57 PM

టీడీపీకి నాయకులు ఒకరి వెంట ఒకరు గుడ్ చెబుతూ అధికార వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే నేతల వారసులు పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ.. తన తండ్రి సమక్షంలోనే శనివారం వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో రవితేజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల గంటాపై ట్విటర్‌ వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక గ౦టా చేరికపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని, సరైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి, చాలా మంది టీడీపీ శాసనసభ్యులు తమ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Also Read :

బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !

“ఆ” చాట్ చెయ్యాలట, దెబ్బకు చిప్పకూడు తింటున్నాడు