IPL 2020 : CSK vs SRH నువ్వా..నేనా.. తేలేది నేడే !
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. ఈ రెండు జట్లకు ఒకే రకమైన పోలీక ఉంది. అదే ఈ రెండు జట్లప్రత్యేకత.. అదే రెండు జట్లకూ కీలకమైనది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య సాగే పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతకు దారి తీస్తోంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లకు తాజా మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం కానుంది. మున్ముందు ప్లే ఆఫ్ అవకాశాలు దక్కించుకోవాలంటే ఇందులో తప్పనిసరిగా గెలిచి తీరాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో రెండు జట్లు స్పెషల్ ఫోకస్‌తో ఆడే అవకాశం ఉంది. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలవడంతో సన్ రైజర్స్ ఒకింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతుంది. గత మ్యాచ్‌లో లాగే ఈ మ్యాచ్‌లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించాలని భావిస్తోంది.
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు చెన్నై జట్టు తరుపున బరిలో దిగుతుండటం ఆ జట్టుకు కలిసివచ్చే అంశ. ముంబైతో మొదటి మ్యాచ్‌లో రాయుడు గాయపడి చెన్నై జట్టుకు దూరమయ్యాక.. ఆ జట్టు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. రాయుడి చేరికతో చెన్నై జట్టు బ్యాటింగ్ బలోపేతం కానుంది. రాయుడు టాప్ ఆర్డర్‌లో ఆడితే మురళీ విజయన్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయ్ విఫలమయ్యాడు. ఇక ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కేదార్ జాదవ్ స్థానంలో బ్రావో జట్టులో చేరవచ్చు.