బాపూజీ బొమ్మతో బ్రహ్మీ ఘననివాళి.!
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని యావత్ దేశం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి.. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు బాపుకి ఘననివాళులు అర్పిస్తూ స్మరించుకుంటున్నారు. వెండితెరపై నవ్వులు విరజిమ్మి తెలుగుప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించున్న ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈ సందర్భంలో తన కుంచెకు పదునుపెట్టారు. తాను సవ్వచాచినని చెప్పకనే చెబుతూ మహాత్ముడి చిత్రాన్ని గీసి బయటకు వదిలారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మీ తనలోని కళా నైపుణ్యాన్ని బాపూజీకోసం మరోసారి ప్రదర్శించారు. […]
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని యావత్ దేశం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి.. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు బాపుకి ఘననివాళులు అర్పిస్తూ స్మరించుకుంటున్నారు. వెండితెరపై నవ్వులు విరజిమ్మి తెలుగుప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించున్న ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈ సందర్భంలో తన కుంచెకు పదునుపెట్టారు. తాను సవ్వచాచినని చెప్పకనే చెబుతూ మహాత్ముడి చిత్రాన్ని గీసి బయటకు వదిలారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మీ తనలోని కళా నైపుణ్యాన్ని బాపూజీకోసం మరోసారి ప్రదర్శించారు. ఇప్పుడు ఆ చిత్రం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజి లెక్చరర్ గా పనిచేసిన కాలంలోనూ బ్రహ్మానందం తనలోని సామాజిక స్పృహను చాటుతూ చిత్రాలు గీసిన సందర్భాలు ఉన్నాయి.
తాను సాహితీ, అభినయ ప్రియుడ్ని మాత్రమే కాదు తనలో మంచి చిత్రకారుడు కూడా ఉన్నాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో బ్రహ్మీ రుజువుచేసుకున్నారు. ఇటీవలి లాక్ డౌన్ రోజుల్లో ఆయన మహాకవి శ్రీశ్రీ చిత్రాన్ని కూడా పెన్సిల్ ఆర్ట్ ద్వారా గీసిన సంగతి తెలిసిందే. గతంలో బ్రహ్మీ గీసిన మదర్ థెరెస్సా, రాముడు-హనుమ వంటి చిత్రాలు కూడా అందర్నీ అలరించాయి. తన సోదరుల్లో మంచి చిత్రకారులు ఉన్నారని.. దీనికితోడు 6వ తరగతిలో జోసెఫ్ అనే డ్రాయింగ్ మాస్టారు ఇచ్చిన ప్రోత్సాహం తనకు చిత్రకళపై మక్కువను మరింత పెంచిందని చెబుతుంటారు బ్రహ్మానందం.