‘పలాస 1978’ సినిమా బాగా నచ్చింది, బన్నీ ప్రశంస
యాథార్థ సంఘటనల ఆధారంగా 'పలాస 1978' సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ దర్శకుడిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు.
యాథార్థ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ దర్శకుడిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. గొప్ప అంతర్లీన సందేశంతో దర్శకుడు అద్భుతమైన ప్రయత్నం చేశారని, వ్యక్తిగతంగా చిత్రం నాకు చాలా నచ్చిందన్నారు బన్నీ. ‘పలాస 1978’ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు మొక్కను బహూకరించారు అల్లు అర్జున్.
Congratulations to the entire team of Palasa 1978. Watched it and met the director the very next morning. Wonderful attempt with a great underlying message. It had so many good moments . I personally liked it . pic.twitter.com/gjoqYcxxKm
— Allu Arjun (@alluarjun) October 2, 2020
మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.
Thank you Sir. It was a wonderful memory . Your kind gesture, heart felt appriciation towards good cinema made me emotional. Thank you @alluarjun sir. It’s a life time memory. https://t.co/SgZ3THRnfF
— KarunaKumar (@Karunafilmmaker) October 2, 2020
Also Read :