AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? జస్ట్ సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..

ఇప్పటి పరిస్థితుల్లో పాన్ కార్డు అనేది అందరికీ అవసరం. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. గుర్తింపు ధృవీకరణ పత్రంగానే కాకుండా అనేక ఆర్ధిక కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. దీంతో పాన్ కార్డు నెంబర్ అనేది గుర్తించుకోవాలి. ఒకవేళ మార్చిపోతే ఈ మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు

Pan Card: పాన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? జస్ట్ సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Feb 24, 2026 | 8:48 PM

Share

దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అవసరం. మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే జీతం పొందాలన్నా లేదా బ్యాంకులో రూ.50 వేలకు మించి డిపాజిట్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డు అవసరం. ఇంతకాకుండా అనేక ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందేందుకు ఓ గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పాన్ కార్డు అవసరమవుతుంది. అందుకే పాన్ కార్డును ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే పాన్ కార్డు నెంబర్‌ను మార్చిపోతే ఎలా తెలుసుకోవాలి..? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఆధారంగా ఎలా పాన్ నెంబర్ తెలుసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ద్వారా ఇలా..

-ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి -రిజిస్టర్డ్ బటన్ క్లిక్ చేయండి -ఇప్పటికే అకౌంట్ ఉంటే మీ లాగిన్స్ ఉపయోగించండి -ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నా ఖాతాను ఎంపిక చేయండి -పాన్ వివరాలు విభాగంలోకి వెళ్లండి -అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, స్థితి, చిరునామా వంటి వివరాలు తెలుసుకోవచ్చు

ఆధార్ నెంబర్ ద్వారా..

-ఈ ఫైలింగ్ వెబ్ సైట్‌ను ఓపెన్ చేయండి -క్వింక్ లింక్స్ చోట ఇన్‌స్టంట్ ఈ పాన్ ఆప్షన్‌ను ఎంచుకోండి -చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి కొనసాగించండి -మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి -ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి -మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి -ఆ తర్వాత కొనసాగించండి బటన్‌పై క్లిక్ చేయండి -మీ ఆధార్ నెంబర్ ఆధారంగా పాన్ కార్డు నెంబర్ దర్శనమిస్తుంది

ఈ మార్గాల ద్వారా కూడా..

మీ శాలరీ ప్లే స్లిప్‌లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్లలో పాన్ కార్డ్ నెంబర్ ముద్రించి ఉంటుంది. దీంతో వాటి ద్వారా కూడా మీ పాన్ నెంబర్ సులువుగా తెలుసుకోవచ్చు. ఇక గతంలో మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆధారంగా పాన్ కార్డు నెంబర్ తెలుసుకునే అవకాశముంది.

Follow Us