AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Notes: దీపావళికి రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? ఆర్బీఐ సంచలన ప్రకటన

RBI Notes: దీపావళి రాబోయే కొద్ది రోజుల్లోనే ఉంది. మార్కెట్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులతో పాటు నగదును కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. చిల్లర మార్కెట్లలో 100-200 రూపాయల లోపు నోట్లకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఇదిలా ఆర్బీఐ..

RBI Notes: దీపావళికి రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? ఆర్బీఐ సంచలన ప్రకటన
Indian Currency
Subhash Goud
|

Updated on: Nov 03, 2026 | 3:53 PM

Share

PIB Fact Check: దీపావళి పండుగకు ముందు చిన్న నోట్ల కొరత ఏర్పడుతుందని, రూ.10, రూ.20, రూ.50 నోట్లు సరిపడా అందుబాటులో ఉండవంటూ వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్ అవుతోంది. దీనిపై PIB Fact Check కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఆర్బీఐ నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా?

దీపావళి రాబోయే కొద్ది రోజుల్లోనే ఉంది. మార్కెట్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులతో పాటు నగదును కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. చిల్లర మార్కెట్లలో 100-200 రూపాయల లోపు నోట్లకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఇదిలా ఉండగా, 10, 20, 50 రూపాయల నోట్ల కొరత ఉందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర బ్యాంకు అయిన ఆర్‌బిఐకి చెందినదిగా పేర్కొంటూ జారీ చేసిన ఒక సర్క్యులర్ కూడా ఈ వాదనతో ప్రచారంలో ఉంది.

కొత్త 10, 20, 50 రూపాయల నోట్ల కొరత ఉందనే వాదనలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. వాట్సాప్‌లో షేర్ అవుతున్న సందేశం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్క్యులర్ ప్రకారం, పండుగ సీజన్‌లో చిన్న డినామినేషన్ నోట్లు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండవు.

అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వాదనను అవాస్తవమని కొట్టివేసింది. చిన్న డినామినేషన్ నోట్ల లభ్యతకు సంబంధించి ఆర్‌బిఐ ఎలాంటి ప్రకటన చేయలేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంలోని వాదనలు పూర్తిగా అబద్ధం. దీపిఐ ఆర్బీఐ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అసత్యమని పేర్కొంది.

రూ.10, 20, 50 నోట్ల ముద్రణ తగ్గిందా?

వాట్సాప్‌లో ప్రచారంలో ఉన్నట్లుగా చెబుతున్న సర్క్యులర్‌పై అక్టోబర్ 27, 2026 తేదీ ఉంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి 10, 20, 50 రూపాయల నోట్ల ముద్రణను క్రమంగా తగ్గిస్తున్నట్లు అది పేర్కొంటుంది. ఈ వైరల్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లు దీపావళికి సరిపడా అందుబాటులో ఉండవంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఈ విషయంపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని PIB Fact Check స్పష్టం చేసింది. కాబట్టి వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశాన్ని ప్రజలు నమ్మవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us