నిర్మాత కృష్ణకాంత్ ఆకస్మిక మరణం
ప్రముఖ తమిళ నిర్మాత కృష్ణకాంత్ (52) ఆకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ తమిళ నిర్మాత కృష్ణకాంత్ (52) ఆకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం సాయంత్రం ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థలో తొలుత మేనేజర్‌గా పని చేసిన కృష్ణకాంత్ తర్వాత ‘తిరుడా తిరిడి’ సినిమా ద్వారా నిర్మాతగా మారారు. తర్వాత మన్మథుడు, కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి సినిమాలను నిర్మించారు. కృష్ణకాంత్ బుధవారం గుండెపోటుకు గురవడంతో ఫ్యామిలీ మెంబర్స్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణకాంత్ మృతికి హీరో శింబు, టీ రాజేందర్, దర్శకుడు సుబ్రమణ్యం శివ సంతాపాన్ని ప్రకటించారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించగా, పలువురు ప్రముఖులు కృష్ణకాంత్‌కు నివాళులు అర్పించారు.
Also Read :
TS DOST 2020 : తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు అలర్ట్