ఫోర్జరీ కేసులో కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా అరెస్ట్, జనవరి 2 వరకు పోలీస్ కస్టడీ, నటి తో బాటు 5 గురిని ఛీట్ చేశాడట

దేశంలో ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయనకు పలు ఖరీదైన లగ్జరీ కార్లున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈయనకు చెందిన డీసీ డిజైన్స్ స్టూడియోను, 75 లక్షల అవంతి స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫోర్జరీ కేసులో కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా అరెస్ట్, జనవరి 2 వరకు పోలీస్ కస్టడీ, నటి తో బాటు 5 గురిని ఛీట్ చేశాడట
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 4:46 PM

దేశంలో ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయనకు పలు ఖరీదైన లగ్జరీ కార్లున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈయనకు చెందిన డీసీ డిజైన్స్ స్టూడియోను, 75 లక్షల అవంతి స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఇతనికి మెర్సిడెస్, బెంజ్, ఆడి వంటి అత్యంత విలాసవంతమైన కార్లు ఉన్నాయని, పలువురు సెలబ్రిటీలకు ఈయన వాహనాలను అమ్మాడని వారు తెలిపారు. ఒక నటితో బాటు మరో 5 గురు ఈయనపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఈయన ఛీట్ చేశాడని ఆరోపించారు. దిలీప్ ఛాబ్రియా పై పోలీసులు 420 సెక్షన్ తో బాటు ఐపీసీ లోని 465, 467, 471, 120 (బీ) 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈయనను జనవరి 2 వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసింది. కాగా దిలీప్ చీటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.