ఆ బాలీవుడ్ దర్శకుడితో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తోన్న ప్రభాస్.? ఎప్పుడంటే.!
Prabhas And Siddharth Anand: 'డార్లింగ్' ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. 'రాధే శ్యామ్', 'సలార్', నాగ్ అశ్విన్...
Prabhas And Siddharth Anand: ‘డార్లింగ్’ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులతో దాదాపు మూడేళ్ల వరకు ప్రభాస్ బిజీగా ఉండనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ దర్శకుడితో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
హృతిక్ రోషన్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్, ‘వార్’ లాంటి యాక్షన్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తమ ఆన్-గోయింగ్ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని బీ-టౌన్ట్లు టాక్. కాగా, దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో ‘పతాన్’.. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ సినిమాలను తెరకెక్కించనున్నాడు.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..