ఏపీ పంచాయతీ పోరుః సంచలనంగా మారిన ఎస్ఈసీ లేఖ.. ఆ ఫోటో ఉండే పత్రాలు చెల్లవు..!
AP local body elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని కోర్టు సవాళ్లను
AP local body elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని కోర్టు సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల విడుదలచేసింది. దీంతో ఇవాళ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌కు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు, సీఎస్ నిమ్మగడ్డ లేఖాస్త్రం సంధించారు. కుల ధృవీకరణ, ఎన్ఓసీ పత్రాల మీద జగన్ ఫోటోలు తీసేయాలని ఆదేశించారు. ఈ టైమ్‌లో తహసీల్దార్లు ఇచ్చే ఈ పత్రాలపై జగన్ ఫోటో ఉండడం నియమావళికి విరుద్దమన్నారు. ఉన్నపళంగా మండలాల్లో తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని సూచించారు. అదే టైమ్‌లో అభ్యర్థులకు జారీ చేయాల్సిన నోఅబ్జక్షన్, కులదృవీకరణ పత్రాల్లో జారీ వద్దని కూడా ఆదేశించారు.
ఇదీ చదవండి… పల్లెల్లో మోగిన నగారా.. నేటి నుంచే తొలి ఘట్టం షురూ.. మొదటి విడతో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు