‘అమ్మకి అమ్మాయికి బైక్‌‌‌‌కి అవినాభావ సంబంధం సంబంధం ఉంది’.. ఆకట్టుకుంటున్న ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ టీజర్

అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇచట వాహనాలు నిలుపరాదు'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన  దర్శకుడు ఎస్. దర్శన్...

  • Rajeev Rayala
  • Publish Date - 10:40 am, Fri, 29 January 21
'అమ్మకి అమ్మాయికి బైక్‌‌‌‌కి అవినాభావ సంబంధం సంబంధం ఉంది'.. ఆకట్టుకుంటున్న 'ఇచట వాహనాలు నిలుపరాదు' టీజర్

Ichata Vahanamulu Nilupa Radu  : అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనాలు నిలుపరాదు’. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన  దర్శకుడు ఎస్. దర్శన్  దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్లు  సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు .

‘నా లైఫ్ లో అమ్మకి అమ్మాయికి బైక్ కి అవినావభావ సంబంధం ఉంది’ అంటూ సుశాంత్ చెప్పే డైలాగ్ సినిమా కథకు హింట్ ఇచ్ఛేలా ఉంది. అనుకోకుండా నో పార్కింగ్ లో బైక్ పార్క్ చేయడం కారణంగా ఓ యువకుడి జీవితం ఎలా డేంజర్ లో పడిందో చూపించనున్నాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ – ప్రియదర్శి – అభినవ్ గోమటం – నిఖిల్ ఇతరపత్రాల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ  సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తై ..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి..