Bigg Boss 4 : వాళ్ళవల్లే హౌస్ నుంచి గుజరాతీభామ ఎలిమినేట్ అయ్యిందా..? అసలు కారణం అదేనా..?

బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో చాలా చప్పగా సాగింది. చాలామందికి తెలియని కంటెస్టెంట్స్ ను తీసుకు వచ్చి హౌస్ లో పడెయ్యడంతో మొదట్లో షో అంత ఆసక్తిగా సాగలేదు.

Bigg Boss 4 : వాళ్ళవల్లే హౌస్ నుంచి గుజరాతీభామ ఎలిమినేట్ అయ్యిందా..? అసలు కారణం అదేనా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2020 | 4:41 PM

బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో చాలా చప్పగా సాగింది. చాలామందికి తెలియని కంటెస్టెంట్స్ ను తీసుకు వచ్చి హౌస్ లో పడెయ్యడంతో మొదట్లో షో అంత ఆసక్తిగా సాగలేదు. ఇప్పుడు చివరకు వచ్చేసరికి షో రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 4 మరో వారంలో పూర్తికాబోతుంది. గత వరం హౌస్ నుంచి అందరు అనుకున్నట్టుగానే మోనాల్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి మోనాల్ ఎప్పుడో  బయటకు రావాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ చొరవ వల్లే ఆమె ఇప్పటివరకు కొనసాగిందని కొందరు భావిస్తున్నారు.

మోనాల్ తెలుగు అమ్మాయి కాదు.  గుజరాతీ భామ దాంతో ఈ అమ్మడు తెలుగు బిగ్ బాస్ కు సెలక్ట్ అయ్యిందని తెలిసిన దగ్గరనుంచి గుజరాతీలు మోనాల్ కు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తూ ఎలిమినేషన్ నుంచి బయటపడేస్తూ వచ్చారని కొందరు అంటున్నారు. ఇక ఈ అమ్మడు హౌస్ లోకి  అడుగుపెట్టి ఆతర్వాత వచ్చిన వారందరికీ మంచి నీళ్లు అందించి మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసింది. ఆతర్వాత హౌస్ లో అభిజీత్ తో క్లోజ్ గా ఉంటూ చట్టపట్టాలేసుకు తిరిగింది. ఆతర్వాత అభిజీత్ నుంచి వదిలేసి అఖిల్ కు దగ్గరయింది. అఖిల్ తో ఈ ముద్దుగుమ్మ చాలానే నడిపింది.

ఇక మోనాల్ కారణంగా అఖిల్ కు అభిజీత్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక మోనాల్ హౌస్ లో ఉన్న అందరితో గొడవలు పెట్టుకుంది. హౌస్ లో ఈ ముద్దుగుమ్మ ఏడ్చినట్టు ఎవ్వడు ఏడ్చి ఉండరేమో.. అందుకే నాగార్జున కూడా నర్మదా అని పేరుపెట్టాడు. ఇక మోనాల్ అభిజీత్ నుంచి దూరం కావడంతో అభిజీత్ ఫ్యాన్స్  ఆమెకు రివర్స్ అయ్యారు. మోనాల్ కు సపోర్ట్ చేయడం మానేశారు. అలాగే చివర్లో అఖిల్ ను కూడా పక్కన పెట్టేసి తన గేమ్ తాను ఆడింది. ఇలా అఖిల్ తో కూడా మోనాల్ గొడవ పెట్టుకోవడంతో అఖిల్ అభిమానులు మోనాల్ కు ఓట్లేయడం మానేశారు. దానితో పాటు చీటికీ మాటికీ ఇంట్లో ఉన్నవారితో గొడవలు పెట్టుకోవడం, ఏడవడంతో మోనాల్ పైన చాలా మందికి సరైన ఇంప్రెషన్ లేకుండా పోయింది. ఇక, చివర్లో లోకల్ కంటెస్టెంట్లకే ప్రేక్షకులు మద్దతు పలికారు. అలాగే, సెలెబ్రిటీలు సైతం మన వారికే అండగా నిలవడంతో గుజరాతీ భామ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..