ఆచార్య అప్‌డేట్… సినిమాలో ఆ హీరో ఫుల్ లెన్త్… ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ…మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 3:17 pm, Mon, 14 December 20
ఆచార్య అప్‌డేట్... సినిమాలో ఆ హీరో ఫుల్ లెన్త్... ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ...మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో కొద్ది నిమిషాల పాటు చెర్రీ కనిపించబోతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. దాన్ని చిరంజీవి ధృవీకరించారు.  ఆ పాత్ర చాలా కీలకమైందని, స్టోరీ చెప్పే సమయంలోనే ఇందులో చెర్రీని ఊహించుకున్నట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కోసం రాజమౌళి, చెర్రీకి పర్మిషన్ ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.

 

జా సిని కబర్ ఏంటంటే… ఆచార్యలో చరణ్ సినిమా మొత్తం కనిపించనన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు దర్శకుడు కొరటాల శివ సైతం ఈ విషయం తన సన్నిహితులతో తెలిపినట్లు సమాచారం. ఏదీ ఏమైనా భర్త, కొడుకు కలిసి నటించాలన్న చిరంజీవి భార్య సురేఖ కల ఆచార్యతో నెరవేరబోతోంది. అంతేకాకుండా చిరు సినిమాలో చరణ్ సినిమా మొత్తం కనిపిస్తాడన్న న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.