లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఎందుకంటే…

కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్​డౌన్ మాత్ర‌మే ప్ర‌ధానం ఆయుధంగా భావిస్తోంది కేంద్రం. అందుకే తొలి విడుతలో భాగంగా మార్చి 24 నుంచి ఏప్రిల్​ 14 వరకు లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యాప్తి విషయంలో ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో మెరుగైన ఫ‌లితాలే ఉన్నా కూడా..పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికే 10వేల మార్క్ దాటింది. రాష్ట్రాల‌లో కూడా రోజురోజుకు కేసులు పెరిగిపోవ‌డంతో… ఆంక్షలు కొనసాగించడం త‌ప్ప‌నిస‌రిగా మారింది. లాక్​డౌన్​ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో ప‌లు […]

లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఎందుకంటే...
Follow us

|

Updated on: Apr 14, 2020 | 12:59 PM

కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్​డౌన్ మాత్ర‌మే ప్ర‌ధానం ఆయుధంగా భావిస్తోంది కేంద్రం. అందుకే తొలి విడుతలో భాగంగా మార్చి 24 నుంచి ఏప్రిల్​ 14 వరకు లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యాప్తి విషయంలో ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో మెరుగైన ఫ‌లితాలే ఉన్నా కూడా..పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికే 10వేల మార్క్ దాటింది. రాష్ట్రాల‌లో కూడా రోజురోజుకు కేసులు పెరిగిపోవ‌డంతో… ఆంక్షలు కొనసాగించడం త‌ప్ప‌నిస‌రిగా మారింది. లాక్​డౌన్​ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపింది కేంద్రం.

స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంల‌తో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత‌నాలు జ‌రిపారు. అంద‌రూ పొడిగింపుకే మొగ్గు చూప‌డంతో…వారి అభిప్రాయాల అనంత‌రం..మోదీ ఏప్రిల్ 30వ‌ర‌కు లాక్​డౌన్​ కొన‌సాగిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఊహించ‌ని విధంగా మే 3 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రాష్ట్రాలు కోరినదానికన్నా 3 రోజులు ఎక్కువగా లాక్​డౌన్ కొనసాగించడానికి ఓ రీజ‌న్ ఉంది.మే 1… కార్మిక దినోత్సవం, పబ్లిక్ హాలిడే. మే 2 శనివారం, మే 3 ఆదివారం. ఈ 3 రోజులు ఎలాగో సెలవులే కాబట్టి… లాక్​డౌన్​ను అప్పటివరకు పొడిగించడమే మేలని భావించింది కేంద్రం. దీంతో మొత్తంగా భారత్​ 40 రోజులు లాక్​డౌన్​లో ఉంటుంది.