డాక్ట‌ర్‌కు క‌రోనా..ఆ రాష్ట్రంలో ఇదే తొలి కేసు

డాక్ట‌ర్‌కు క‌రోనా..ఆ రాష్ట్రంలో ఇదే తొలి కేసు

క‌రోనా ర‌క్క‌సి దాహం తీర‌టం లేదు. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న కోవిడ్ భార‌త్‌లోనూ విశ్వ‌రూపం చూపెడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తూ..త‌న ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. క‌రోనా క‌న్ను ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల‌పై ప‌డుతోంది.

Jyothi Gadda

|

Apr 14, 2020 | 1:19 PM

క‌రోనా ర‌క్క‌సి దాహం తీర‌టం లేదు. ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న కోవిడ్ భార‌త్‌లోనూ విశ్వ‌రూపం చూపెడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తూ..త‌న ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. క‌రోనా క‌న్ను ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల‌పై ప‌డుతోంది. ఏప్రిల్ 12న నాగాలాండ్‌లో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదుకాగా, తాజాగా మేఘాల‌య‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది.

మేఘాల‌యలో తాజాగా క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. త‌మ రాష్ట్రంలో ఒక్క కోవిడ్‌ కేసు కూడా లేనందున‌, లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ మేఘాల‌య‌లో తొలి కేసు న‌మోదైంది. దీంతో అక్క‌డి స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. షిల్లాంగ్‌లోని బెథ‌నీ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న వైద్యుడికి క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించ‌‌గా సోమ‌వారం పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మార్చి 22 నుంచి స‌ద‌రు ఆసుప‌త్రికి వెళ్లినవారు వెంట‌నే 108ను సంప్ర‌దించాల‌ని, లేదా http://meghalayaonline.gov.in/covid/login.htm లో త‌మ పేరు ‌న‌మోదు చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఆ ఆసుప‌త్రి నుంచి రోగులు, డాక్ట‌ర్లు, న‌ర్సు, ఇత‌ర సిబ్బంది ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది.

మ‌రోవైపు అధికారులు అత‌నితో స‌న్నిహితంగా మెలిగిన వారి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో నేటి నుంచి 48 గంట‌ల‌పాటు క‌ర్ఫ్యూ విధించారు. ఈ కొత్త కేసుతో ఈశాన్య రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య 38కి చేరింది. ఇందులో అస్సాం 30, మ‌ణిపూర్‌, త్రిపుర 2, మిజోరాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, నాగాలాండ్, మేఘాల‌యాల్లో ఒక్కో కేసు న‌మోద‌య్యాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu