రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. నిన్నటి కంటే మెరుడుపడిన ఆరోగ్యం.
అస్వస్థత కారణంగా శుక్రవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. రజినీ ఆరోగ్యంపై ఆపోలో ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి...

Rajini latest health bulletin: అస్వస్థత కారణంగా శుక్రవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. రజినీ ఆరోగ్యంపై ఆపోలో ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి. రజినీకి మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరీక్షల నివేదికలు సాయంత్రకల్లా వస్తాయని చెప్పారు. ఇక రక్త పోటు హెచ్చు, తగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రజినీ కాంత్‌ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వైద్యులు వివరించారు. రజినీని కలవడానికి ప్రస్తుుతానికి ఎవరినీ అనుమతించడంలేదని, ఆయనను పరామర్శించడానికి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో జరుగుతోన్న ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రజినీ ఒకేసారి రక్తపోటు పెరగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం రజినీతో ఆయన భార్య, కూతురు ఉన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే రజినీ వ్యక్తిగత వైద్య బృందం హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.
