vikarabad accident: వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం..కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. లారీ ఓనర్‌పై, ఆటో డ్రైవర్ ఇంటిపై దాడి…
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో పది మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

వికారాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చిట్టంపల్లిలో ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో పది మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత కోపోద్రిక్తులైన గ్రామస్థులు లారీ ఓనర్ షేక్ రఫీని చితకబాదారు. దీంతో అతడు తీవ్ర గాయాలతో మొమిన్ పేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆటో డ్రైవర్ హరి పరారిలో ఉన్నాడు. ఆటో డ్రైవర్ ఇంటిపై కూడా గ్రామస్థుల దాడికి పాల్పడ్డారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై దట్టమైన పొగమంచు ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతులు నితిన్, సోనాభాయ్, సంజీవ్, శ్రీనిభాయ్, రేణుకాభాయ్ లుగా గుర్తించారు. వీరంతా రోజు కూలీలు. మరికొందరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read :
