ప్రిన్స్‌పై పొగడ్తల వర్షం కురిపించిన బాలీవుడ్ హీరో.. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ ఒకరంటూ వ్యాఖ్య.
ఎంత మంది యంగ్ హీరోలు పోటీకి వస్తోన్నా ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. సినిమా అవకాశాలతో పాటు తన అందంతో ఈతరం హీరోలు సవాలు విసురుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా..

Ranvir singh comments on mahesh babu: ఎంత మంది యంగ్ హీరోలు పోటీకి వస్తోన్నా ప్రిన్స్ మహేష్ బాబు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. సినిమా అవకాశాలతో పాటు తన అందంతో ఈతరం హీరోలు సవాలు విసురుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రకటనల్లోనూ నటిస్తూ మహేష్ తనకు సరిలేరు ఎవరూ అని చాటిచెబుతున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ఓ షూట్‌లో పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన రణ్వీర్.. ‘నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరు. మా ఇద్దరి కలయిక ఎప్పడూ అద్భుతంగా ఉంటుంది. అన్నయ్య మహేష్ బాబు గారి పట్ల నా ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ చేసిన ప్రిన్స్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.




