Weather Alert: శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం నుంచి వర్షాలు కొనసాగనున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో ఓ వైపు ఉపరితల ఆవర్తనం.. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ-తెలంగాణల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు సైతం కురవనున్నాయి. శుక్రవారం ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో తెలుసుకుందాం..
శుక్రవారం వెదర్ రిపోర్ట్..
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో శుక్రవారం (07-08-2026) అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ) వెల్లడించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్..
శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో కూడా వాతావరణం మేఘావృతమైంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
