సెప్టెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ ఇవే..

ప్యాసింజర్  రైళ్ల పునరుద్ధరణలో భాగంగా రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

సెప్టెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ ఇవే..
Follow us

|

Updated on: Sep 06, 2020 | 12:30 PM

ప్యాసింజర్  రైళ్ల పునరుద్ధరణలో భాగంగా రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అందుకు సంబంధించిన రిజర్వేషన్లు ఈనెల 10వ తేదీ నుంచే ప్రారంభమవుతాయి. రూట్ల వారీగా సదరు రైళ్ల వివరాలను రైల్వేబోర్డు ఆయా జోన్ల జనరల్‌ మేనేజర్లకు పంపించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించాక మొదట వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైళ్లను నడిపించింది.(Railways to start 80 new special trains)

ఇక ప్రయాణీకులకు మే 12 నుంచి 30 ఏసీ రైళ్లు, జూన్‌ ఒకటి నుంచి 200 సాధారణ రైళ్లు కలిపి మొత్తం 230 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్‌ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రజల రాకపోకలు పెరగడం, అందుబాటులో ఉన్న రైళ్లలో రద్దీ కారణంగా సెప్టెంబర్ 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వేశాఖ ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది.

ఇదిలా ఉంటే ప్రత్యేక రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు.. దాని పరిధిలోని తెలుగు రాష్ట్రాలకు దక్కింది నామ మాత్రమే. హైదరాబాద్‌కు నాలుగు రైళ్లే నడవనున్నాయి. సికింద్రాబాద్‌-దర్బంగా , దర్బంగా-సికింద్రాబాద్‌ , హైదరాబాద్‌-పర్బని , పర్బని-హైదరాబాద్‌ ఉన్నాయి. బీహార్‌, మహారాష్ట్రలకు వెళ్లేవారికే వీటితో ప్రయోజనం ఉంటుంది. సికింద్రాబాద్‌-విజయవాడల మధ్య కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర రద్దీ ప్రాంతాల మధ్య కానీ ఒక్కటంటే ఒక్క రైలునూ ప్రకటించలేదు.

ప్రత్యేక రైళ్ల ప్రకటనలో తమిళనాడుకు రైల్వేబోర్డు పెద్దపీట వేసింది. ఆ రాష్ట్రం పరిధిలో రాకపోకలు సాగించేవారి కోసం ఏకంగా 13 ప్రత్యేక రైళ్లను రైల్వేబోర్డు ప్రకటించింది. సదరు రైళ్లన్నీ పూర్తిగా ఆ రాష్ట్రం పరిధిలోనే తిరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. అయితే రిజర్వేషన్‌ కోటా నామ మాత్రంగా ఉండే వాటితో ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: రైల్వే ప్రయాణీకులకు తీపికబురు…