వ్యాక్సిన్‌పై ట్రంప్ మాటల్ని నేను నమ్మట్లేదు: హారిస్
కోవిడ్ వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటల్ని తాను నమ్మడం లేదని డెమోక్రాటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న కమలా హారిస్ పేర్కొన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటల్ని తాను నమ్మడం లేదని డెమోక్రాటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న కమలా హారిస్ పేర్కొన్నారు. ట్రంప్ ఆశలు కల్పిస్తున్నట్లు ఒకవేళ అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని శక్తి.. సామర్థ్యాలు, భద్రతపై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని దాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థలపై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కమలా హారిస్ ఆయనపై విమర్శలు గుప్పించారు.
తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వైరస్ వ్యాప్తి కట్టడి కీలక ప్రచారాస్త్రంగా మారింది. ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తికి నియంత్రించడంలో ఫెయిలయ్యారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఇప్పటి వరకు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయటపడడానికి ట్రంప్ ప్రత్యర్థులపై వ్యాక్సిన్ అస్త్రాన్ని విసురుతున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. అందుకు సంస్థలకు కావాల్సిన సహకారాన్ని గవర్నమెంట్ నుంచి అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు నవంబరు 1 నాటికి వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు అమెరికా వ్యాధి నియంత్రణా, నివారణ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Also Read :