ఎన్నికల్లో ఓటమిపై రాహుల్ స్పందన
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేసిన రాహుల్… అమేథీలో ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలే నేతలు అని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పాను. ఆ ప్రజలు నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీ, బీజేపీకి శుభాకాంక్షలు. అమేథీలో ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల అవసరాన్ని […]
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేసిన రాహుల్… అమేథీలో ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
‘ప్రజలే నేతలు అని ఎన్నికల ప్రచారంలో నేను చెప్పాను. ఆ ప్రజలు నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని నిర్ణయించారు. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీ, బీజేపీకి శుభాకాంక్షలు. అమేథీలో ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల అవసరాన్ని గౌరవిస్తున్నా. స్మృతి ఇరానీకి అభినందనలు. అమేథీ ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి. మా ఓటమిని పరిశీలించుకునేందుకు ఈ రోజు సరైన సమయం కాదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే దీనిపై సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుంది’ అని రాహుల్‌గాంధీ తెలిపారు.