వైసీపీ సునామీలో వారసత్వ రాజకీయాలకిక చెల్లు..!

ఏపీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను తీక్షణంగా చూస్తే ఇప్పటివరకు రాజకీయ ఉద్దండులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ ఓటమి బాటలో పయనిస్తున్నాడు. అటు గెలవడం తప్ప ఓటమి రుచి చూడని జేసీ ఫ్యామిలీ తొలిసారి ఓటమి బాట పట్టింది. మొదటిసారి పోటీ చేసిన జేసీ వారసులిద్దరూ కూడా ఓడిపోతున్నారు. అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి […]

వైసీపీ సునామీలో వారసత్వ రాజకీయాలకిక చెల్లు..!
Follow us

|

Updated on: May 23, 2019 | 6:16 PM

ఏపీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను తీక్షణంగా చూస్తే ఇప్పటివరకు రాజకీయ ఉద్దండులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి కంచుకోట అయిన రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల శ్రీరామ్ ఓటమి బాటలో పయనిస్తున్నాడు. అటు గెలవడం తప్ప ఓటమి రుచి చూడని జేసీ ఫ్యామిలీ తొలిసారి ఓటమి బాట పట్టింది. మొదటిసారి పోటీ చేసిన జేసీ వారసులిద్దరూ కూడా ఓడిపోతున్నారు. అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ పవన్, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ లు ఘోర పరాజయం వైపు అడుగులు వేస్తున్నారు.

1999 నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మంత్రి దేవినేని ఉమ తొలిసారి ఓటమి పాలయ్యారు. ఇక కర్నూలు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కేఈ ఫ్యామిలీ ఈసారి ఓడిపోయింది. పొన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకు డబుల్ హ్యాట్రిక్ మిస్ అయ్యేలా ఉంది. ఇక 1996 ఉప ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓటమి ఎరగని మంత్రి అమర్‌నాధ్ రెడ్డి ఓటమి బాటలో ఉన్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, నారా లోకేష్లకు ఈ ఎన్నికల్లో చుక్కెదురవుతోంది. అటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఓటమిపాలయ్యారు.

Latest Articles