రాఫెల్‌పై రేపు తీర్పు వెలువరించనున్న సుప్రీం

రాఫెల్‌ విమానాల ఒప్పందంపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీలు వేసిన పిటీషన్‌పై ఇది వరకే కోర్టు వాదనలు విన్నది. దొంగిలించిన పత్రాలను సాక్ష్యాలుగా చూపుతూ పిటీషనర్లు కేసు వాదించడాన్ని అడ్వకేట్‌ జనరల్‌ వ్యతిరేకించారు. అలాగే ప్రభుత్వం గతంలో ఇదే కేసుకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు దోషాలు ఉన్నాయని, వాటిని సరి చేసి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం వాదించింది. […]

రాఫెల్‌పై రేపు తీర్పు వెలువరించనున్న సుప్రీం
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 1:00 PM

రాఫెల్‌ విమానాల ఒప్పందంపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీలు వేసిన పిటీషన్‌పై ఇది వరకే కోర్టు వాదనలు విన్నది. దొంగిలించిన పత్రాలను సాక్ష్యాలుగా చూపుతూ పిటీషనర్లు కేసు వాదించడాన్ని అడ్వకేట్‌ జనరల్‌ వ్యతిరేకించారు. అలాగే ప్రభుత్వం గతంలో ఇదే కేసుకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు దోషాలు ఉన్నాయని, వాటిని సరి చేసి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం వాదించింది. దొంగిలించిన పత్రాలైనా సరే కేసుకు ఉపయోగపడుతాయని భావిస్తే… వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో తప్పు లేదని న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించడంతో తుది తీర్పుపై టెన్షన్‌ నెలకొంది. మొత్తానికి ఈ కేసులో రేపు రానున్న తీర్పు ఉత్కంఠ రేపుతుంది.