AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : రాఫెల్ జెట్ విమానం.. స్పోర్ట్స్ కారు మధ్య రేస్..! ఏది గెలిచిందో చూడండి..? వైరల్‌గా మారిన వీడియో..

Bugatti vs Rafale : మీరు ఇప్పటివరకు ఇలాంటి రేసును చూసి ఉండరు. సాధారణంగా ఒక కారు మరొక కారుతో పోటీ పడుతుంది.

Viral Video : రాఫెల్ జెట్ విమానం.. స్పోర్ట్స్ కారు మధ్య రేస్..! ఏది గెలిచిందో చూడండి..?  వైరల్‌గా మారిన వీడియో..
Bugatti Vs Rafale Race
uppula Raju
|

Updated on: May 21, 2021 | 10:10 PM

Share

Bugatti vs Rafale : మీరు ఇప్పటివరకు ఇలాంటి రేసును చూసి ఉండరు. సాధారణంగా ఒక కారు మరొక కారుతో పోటీ పడుతుంది. ఒక బైక్ మరొక బైక్‌తో పోటీ ఉంటుంది. కానీ మొదటిసారిగా ఫైటర్ జెట్, స్పోర్ట్స్ కారు మధ్య రేసు జరిగింది. అవును మీరు విన్నది నిజమే.. రెండు వేగానికి ప్రసద్ధి చెందినవి. అయితే ఏది గెలిచిందో తెలుసుకుందాం. రెండిటి మధ్య రేసు ఫ్రాన్స్‌లోని డసాల్ట్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. బుగట్టి చిరోన్ పుర్ స్పోర్ట్స్‌లో 8.0 లీటర్ డబ్ల్యూ 16 ఇంజన్ ఉంటుంది. ఇది 1500 హెచ్‌పి, 1600 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. మరోవైపు రాఫెల్ జెట్ ఫ్రాన్స్ నేవీకి సంబంధించింది. ఫైటర్ జెట్ రెండు టర్బోజెట్‌లు 58,550 న్యూటన్‌ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంటే నేరుగా 5727 హెచ్‌పి శక్తి అని అర్ధం.

అదే సమయంలో 16 సిలిండర్లతో బుగట్టి చిరోన్ పుర్ స్పోర్స్ట్ కారు 490 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇది 1912 కిలోమీటర్ల వేగంతో రాఫెల్ ఫైటర్ జెట్ కంటే చాలా తక్కువ. ట్రాక్‌పై రాఫెల్ చాలా బలంగా కనిపిస్తుంది. కానీ బుగట్టితో పోటీ పడటానికి ట్రాక్‌లో రేసు ప్రారంభించబడింది. రేసు ప్రారంభంలో బుగట్టి చిరోన్ పూర్ ముందంజ వేసింది. డ్రైవర్ వెంటనే కారు వేగాన్ని కేవలం 2.4 సెకన్లలో 100 కిలోమీటర్లకు పెంచాడు. కేవలం 6.1 సెకన్లలో కారు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. తరువాత కేవలం13 సెకన్లలో అది 300 క్యాచ్ చేసి ఆపై అర నిమిషంలో 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

కానీ ఇవన్నీ రాఫెల్‌కు చాలా భిన్నంగా ఉండేవి. 150 మీటర్ల తరువాత జెట్ వేగం 165 కిలోమీటర్లకు చేరుకుంది. అక్కడ జెట్ వెనుకబడి ఉంది. తరువాత జెట్ 350 మీటర్లకు చేరుకున్న వెంటనే దాని వేగం 210 కిలోమీటర్లకు పెరిగింది. తరువాత 450 మీటర్ల తరువాత జెట్ 260 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. బుగట్టి నడుపుతున్న వ్యక్తి మాట్లాడుతూ.. సుమారు 100 మీటర్ల తరువాత నేను రాఫెల్ నుంచి దూరంగా ఉన్నాను. కానీ కొన్ని మీటర్ల తరువాత నేను ఇంకా జెట్ కంటే ముందున్నాను. కానీ ఆ తరువాత అతను ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నా కంటే ముందు వెళ్ళాడు. ఇది అద్భుతమైన పోటీ అని బదులిచ్చాడు.

ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. అధికారిక లెక్కల కన్నా కోవిడ్ మ‌ర‌ణాలు మూడు రెట్లు ఎక్కువ: WHO

Black Fungus, White Fungus : బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్.. వీటిలో ఏది డేంజర్? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

Air Cooler: ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.!